"ప్రాన్ ఛాప్స్" విత్ పుదీనా చట్నీ
కావలసిన పదార్థాలు :రొయ్యలు.. అర కేజీనిమ్మకాయలు.. రెండుకారంపొడి.. ఒక టీ.బ్రెడ్ పౌడి.. 50 గ్రా.రీఫైన్డ్ ఆయిల్.. తగినంతకొత్తిమీర.. 2 కట్టలుఅల్లంవెల్లుల్లి రసం.. 3 టీ.గుడ్డు.. ఒకటిఉప్పు.. తగినంతతయారీ విధానం :ముందుగా పెద్ద సైజు రొయ్యలను తీసుకుని, తోక అలానే ఉంచి మిగిలిన రొయ్యను పెంకు ఒలిచి శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేసిన రొయ్యలను చాకుతో మధ్యకు సగం తోకవరకు చీల్చి పుస్తకంలా విడదీసి చాకు వెనుక భాగంతో నొక్కాలి. ఇలా చేయటంవల్ల రొయ్య వెడల్పు అవుతుంది.తర్వాత వీటిని ఒక ట్రేలో అమర్చి.. వాటిపై సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి రసం, కారంపొడి చల్లి అరగంటసేపు నానబెట్టాలి. తర్వాత ఆ రొయ్యలు ఒక్కోదాన్ని తీసుకుని.. గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ పౌడర్‌లో పొర్లించి బాగా మరుగుతున్న నూనెలో వేసి ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే ప్రాన్ ఛాప్స్ సిద్ధం.. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే పుదీనా చట్నీతో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి.