"చెర్రీ కేక్"తో కలర్‌ఫుల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్..!!
కావలసిన పదార్థాలు :మైదాపిండి.. అర కప్పుకండెన్స్డ్ మిల్క్.. ఒక టీ.వెన్న.. 8 టీ.ఐసింగ్ షుగర్.. 300 గ్రా.చెర్రీపండ్లు.. 200 గ్రా.వంటసోడా.. 2 టీ.ఉప్పు.. అర టీ.స్ట్రాబెర్రీ ఎసెన్స్.. అర కప్పుఎరుపు మిఠాయి రంగు.. అర టీ.వేడినీరు.. 4 టీ.తయారీ విధానం :ముందుగా కండెన్స్డ్ మిల్క్‌లో వేడినీళ్లు, కరిగించిన వెన్న వేసి బాగా గిలకొట్టాలి. దాంతోపాటు ఉప్పు, వంటసోడా, చెర్రీ పండ్లను మైదాపిండిలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ డబ్బాలో బ్రౌన్ పేపర్‌ను పరచి, తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి అరగంటపాటు ఓవెన్లో ఉంచాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రత 350 డిగ్రీలు దాటకుండా చూడాలి.అది ఉడికేంతలోపు ఐసింగ్ షుగర్, మిఠాయి రంగు పొడిని మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. ఓవెన్లో ఉడికించిన కేక్‌ను తీసి ఐసింగ్ షుగర్ మిశ్రమాన్ని దానిపై పోయాలి. అంతే చెర్రీ కేక్ తయారైనట్లే..! దీన్ని సర్వ్ చేసే ముందు నచ్చిన పండ్ల ముక్కలతో అలంకరిస్తే కలర్ఫుల్గా ఉండటమేగాక, ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకేముంది.. చెర్రీ కేక్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతారు కదూ...!!