గరంమసాలా సువాసనలతో "దహీ మచ్చీ"
కావలసిన పదార్థాలు :చేప ముక్కలు.. 300 గ్రా.పెరుగు.. ఒక కప్పుఉల్లిపాయ.. ఒకటిఅల్లంవెల్లుల్లి పేస్ట్.. అర టీ.పచ్చిమిరపకాయలు.. 3బే ఆకులు.. 2గరంమసాలా.. అర టీ.నూనె.. రెండు టీ.నిమ్మరసం.. ఒక టీ.కొత్తిమీర.. ఒక టీ.ఉప్పు.. తగినంతతయారీ విధానం :చేప ముక్కలపై ఉప్పు, నిమ్మరసం వేసి కొద్ది నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తర్వాత బాగా కడగాలి. పెరుగు, ఉప్పు తేలికగా గిలకొట్టి దాన్ని చేప ముక్కల్లో వేసి బాగా కలియబెట్టి అరగంటసేపు నానబెట్టాలి. మూకుడులో నూనె వేడిచేసి బే ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి.ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి కాసేపు ఉడికించాలి. ఆపై పెరుగులో నానబెట్టి ఉంచిన చేప ముక్కలు వేసి కలియబెట్టి గరంమసాలా, ఉప్పు కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్క ఉడికిన తరువాత చివర్లో కొత్తిమీరతో అలంకరించి దించేసి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే దహీ మచ్చీ రెడీ..!