"కలర్‌ఫుల్ మ్యాంగో రైస్ సలాడ్" విత్ టొమోటో, క్యాప్సికమ్..!
కావలసిన పదార్థాలు :టమోటో... ఒకటిక్యాప్సికం... ఒకటిఉల్లికాడ... ఒకటిఅన్నం... ఒక కప్పుమామిడిపండు గుజ్జు... అర కప్పునిమ్మరసం... ఒక టీ.ఆలివ్ నూనె... మూడు టీ.ఉప్పు, మిరియాల పొడి... రుచికి సరిపడాకొత్తిమీర... ఒక కట్టతయారీ విధానం :ముందుగా టమోటో, క్యాప్సికమ్‌లను కోసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఉల్లికాడను సన్నటి చక్రాల్లాగా తరిగి అన్నంలో కలపాలి. మామిడి గుజ్జులో మిరియాలపొడి, ఉప్పు, నూనె, నిమ్మరసం వేసి చిక్కగా తయారు చేయాలి. దీనిని అన్నంలో వేసి బాగా కలిపి రిఫ్రిజిరేటర్లో అరగంటపాటు ఇంచాలి.తినడానికి ముందు తీసి, దీనిని కొత్తిమీరతో అలంకరించుకోవాలి. కొద్దిగా తీపి, కొద్దిగా పులుపు, కొద్దిగా కారంగా తయారైన మ్యాంగో రైస్ సలాడ్ కొత్త రుచితో మిమ్మల్ని అలరిస్తుంది.