కావలసిన పదార్థాలు :
క్యాబేజీ తరుగు.. రెండు కప్పులు
క్యారెట్ తరుగు.. పావు కప్పు
అల్లంవెల్లుల్లి తరుగు.. నాలుగు టీ.
పచ్చిమిర్చి తరుగు.. ఒక టీ.
ఉల్లిపొరక తరుగు.. ఒక కప్పు
మొక్కజొన్న పిండి.. అర కప్పు
మైదా.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
కారం.. ఒక టీ.
నూనె.. తగినంత
సాస్ కోసం...
ఉల్లిపొరక.. అరకట్ట
అల్లం... కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు.. ఆరు
పచ్చిమిర్చి.. రెండు
కారం.. అర టీ.
టొమోటో, సోయాసాస్... చెరో మూడు టీ.
మొక్కజొన్నపిండి.. ఒక టీ.
నీళ్లు.. ఒక కప్పు
ఉప్పు.. తగినంత
నూనె... 4 టీ.
తయారీ విధానం :
ముందుగా క్యాబేజీ తరుగు, మొక్కజొన్న పిండి, క్యారెట్, ఉల్లిపొరక తరుగులు.. ఉప్పు, మైదా, అల్లం, వెల్లుల్లి తరుగులను విడిగా ఓ పాత్రలోకి తీసుకుని బాగా కలపాలి. అవసరమైతేనే నీళ్లు కలపాలి. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి బంగారువర్ణంలోకి వచ్చేదాకా నూనెలో వేయించాలి.
తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి అల్లం, ఉల్లిపొరక తరుగు వేసి వేయించాలి. ఉప్పు, కారం, టొమోటో, సోయా సాస్ కలపాలి. దీనికి కప్పునీళ్లు, నీటిలో కలిపిన మొక్కజొన్న పిండిని వేసి.. ఉడికించాలి. కాస్త చిక్కగా అవుతున్నప్పుడు వేయించిన ఉండల్ని కలిపి దింపేయాలి. ఉల్లిపొరక ముక్కలు, కొత్తిమీర తరుగు గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.