క్రిస్ మస్ స్పెషల్.. క్రైస్తవేతరులు యేసుక్రీస్తును అంగీకరించారనేందుకు 12 వాస్తవాలున్నాయని క్రైస్తవ గురువులు అంటున్నారు.
* అవేంటంటే.. యేసు సిలువపై మృతిచెందాడు
* ఆయన సమాధి చేయబడటం వాస్తవం
* క్రీస్తు మరణము శిష్యులను నిరాశ, నిస్పృహలకు కారణమైంది.
* యేసు సమాధి కొన్ని దినాల తర్వాత ఖాళీగా వున్నట్లు కనిపెట్టబడింది.
* యేసయ్య శిష్యులు, పునరుత్ధానుడైన యేసును చూసిన అనుభవాన్ని నమ్మారు.
* అనుభవం తర్వాత అనుమానించిన శిష్యులు ధైర్యము కలిగిన విశ్వాసులు అయ్యారు.
* ఆది సంఘభోధనలో ఈ వర్తమానం మూలాంశమైయున్నది.
* ఈ వర్తమానం యెరూషలేంలో భోధించారు.
* ఈ భోధనకు ఫలితమే సంఘం ప్రారంభమై ఎదిగింది.
* సబ్బాతు (శనివారం)కు బదులుగా పునరుత్ధానదినం (ఆదివారం) ఆరాధనకు ప్రాముఖ్యమైనదినముగా మారింది.
* అనుమానుస్ధుడుగా గుర్తింపుపొందిన యాకోబు మార్పు చెంది, పునరుత్ధానుడైన క్రీస్తును చూచినట్లు నమ్మాడు.
* క్రైస్తవత్వానికి శత్రువుడైన పౌలు పునరుత్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతనుబట్టి మార్పు చెందినట్లుగా నమ్మాడు.