స్పెషల్ ఈవెనింగ్ స్నాక్స్ "ఛీజ్ పొటాటో చిప్స్"
కావలసిన పదార్థాలు :బంగాళాదుంపలు... పదిఛీజ్.. రెండు కప్పులుకారం.. నాలుగు టీ.నూనె.. తగినంతఉప్పు.. సరిపడాతయారీ విధానం :బంగాళాదుంపలను పల్చగా చిప్స్‌లాగా తరిగి ఉంచాలి. ఈ ముక్కలకు ఉప్పు పట్టించి కనీసం అరగంటసేపు వాటిని ఆరబెట్టాలి. చిప్స్‌లో తేమ పూర్తిగా ఆరిపోయి పొడిగా అయ్యేంతదాకా వాటిని అలాగే ఉంచటం మంచిది. తరువాత చిప్స్‌పై కారం చల్లాలి. నూనె వేడిచేసి బాగా మరుగుతుండగా బంగాళాదుంప ముక్కల్ని వేసి బాగా వేయించి ఒక గిన్నెలోకి తీయాలి.చిప్స్ వేడిగా ఉన్నప్పుడే ఛీజ్‌ను చిప్స్‌కు పట్టించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే వెరైటీగా ఉండే ఛీజ్ పొటాటో చిప్స్ తయారైనట్లే..! వీటిని ఎప్పటికప్పుడు తినేయటం మంచిది. ఎందుకంటే ఒకరోజుకు మించి ఇవి నిల్వ ఉండవు.