స్టార్స్ వండర్ ఫుడ్ "స్టార్ కుకీస్"
కావలసిన పదార్థాలు :బటర్.. 200 గ్రా.ఐసింగ్ షుగర్.. వంద గ్రా.మైదా.. 200 గ్రా.కస్టర్డ్ పౌడర్.. 80 గ్రా.వెనీలా ఎసెన్స్.. 2 టీ.బేకింగ్ పౌడర్.. ఒక టీ.తయారీ విధానం :బటర్ క్రీమ్‌గా అయ్యేలా చేసి అందులో ఐసింగ్ షుగర్‌ను కలిపి మెత్తగా అయ్యేలా చూడాలి. అందులో వెనీలా ఎసెన్స్ కూడా వేసి బాగా కలియబెట్టాలి. మైదా, బేకింగ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్‌లను జల్లించి ఈ క్రీమ్ మిశ్రమంలో వేసి మృదువుగా అయ్యేలా బాగా కలపాలి. ఒకవేళ అది జిగురుగా ఉన్నట్లయితే పదిహేను నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి తీస్తే సరిపోతుంది.ఇప్పుడు వెడల్పాటి పళ్లెంలో మైదా చల్లి దానిమీద ఈ మిశ్రమాన్ని పోసి స్టార్ కట్టర్‌తో కట్ చేసుకోవాలి. మైక్రోవేవ్ ఓవెన్‌ను 180 డిగ్రీల వరకు ముందుగా వేడిచేసుకోవాలి. పైన కట్ చేసుకున్న స్టార్ కుకీస్‌ను ఒక ప్లేట్‌లో పరచి ఓవెన్లో పెట్టి పదిహేను నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. అంతే స్టార్ కుకీస్ తయార్..!!