కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న కండెలు(పెద్దవి)- ఆరు
నీళ్ళు-ఆరు కప్పులు
మొక్కజొన్నపిండి-2 టేబుల్ స్పూన్లు
పంచదార-రెండు టేబుల్ స్పూన్లు
సోయాసాస్-టీస్పూను
చిల్లీసాస్-టీస్పూను
వేనిగర్-1 టీస్పూను
ఉప్పు-తగినంత
తయారీ విధానం :
మొక్కజొన్నకండెల్ని ఒలిచి గింజల్ని కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఇందులో పావుకప్పు గింజల్ని విడిగా తీసి పెట్టాలి. మిగిలిన వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి నీళ్లు కలిపి తక్కువ మంట మీద మరగించాలి. తరువాత 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలిపిన మిశ్రమాన్ని మరుగుతున్న సూప్‌లో పోయాలి.
సూప్ చిక్కబడుతుండగా అడుగంటకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. బాగా చిక్కబడిందనుకున్న తర్వాత పంచదార, ఉప్పు, సోయాసాస్, చిల్లీసాస్, వెనిగర్ కూడా కలిపితే వేడి సూప్ తయార్.