Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాంగై చికెన్ కర్రీ

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
చికెన్... అరకేజీ
ఉల్లికాడలు... ఒక కప్పు
ఉల్లిపాయలు.. రెండు
పచ్చిమిర్చి... రెండు
వెల్లుల్లి, జీడిపప్పు పేస్ట్... చెరో రెండు టీ.
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
గుడ్లు.. రెండు
చక్కెర... కొద్దిగా
ఉప్పు... తగినంత
వెనిగర్... కొన్ని చుక్కలు
టొమోటో సాస్... మూడు టీ.
సోయా సాస్... కొద్దిగా
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
చికెన్‌కు కొద్దిగా ఉప్పు, గుడ్లు, కార్న్‌ఫ్లోర్‌ను పట్టించి, ముక్కలకు పట్టేలా బాగా కలిపి... మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. విడిగా ఓ పాన్‌లో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించి... ఉప్పు, చక్కెర, వెనిగర్‌ను కలపాలి. తరువాత అందులోనే సోయాసాస్, టొమోటో ముక్కలను కలిపి కొద్దిగా నీరు చల్లి మగ్గనివ్వాలి.

ఇప్పుడు ఇందులో వేయించిన చికెన్ ముక్కలను వేసి కాసేపు వేగాక, తరిగి ఉంచుకున్న ఉల్లికాడల ముక్కలను కూడా వేసి వేయించాలి. ఓ ఐదు నిమిషాల తరువాత దించేయాలి. వేడి వేడిగా ఉండే ఈ కూరను ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu