"వెరైటీ ఆనియన్ లీవ్స్ రైస్" విత్ బేక్‌డ్ ప్రాన్స్
కావలసిన పదార్థాలు :అన్నం... రెండు కప్పులుఉడికించిన ప్రాన్స్... వంద గ్రా.ఉడికించిన హోమ్ ముక్కలు... 50 గ్రా.పచ్చిబఠాణీ... వంద గ్రా.ఉల్లికాడల ముక్కలు... 2 కట్టలుదోసకాయ ముక్కలు... ఒక కాయటొమోటో ముక్కలు... ఒక కాయఉల్లికాడల స్లైసెస్... ఒక కాడఉప్పు, మిరియాలపొడి... సరిపడాకోడిగుడ్లు... రెండునూనె... తగినంతతయారీ విధానం :పెనం వేడిచేసి 2 గుడ్ల మిశ్రమం వేసి పల్చగా ఆమ్లెట్ లాగా వేసి, వేగిన తరువాత కొంచెం చల్లబరచాలి. ప్యాన్‌లో 4 టీస్పూన్ల నూనె వేసి కాగిన తరువాత అందులో బఠాణీ, ఉల్లికాడలు వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. వీటిలో అన్నం కలిపి, ఉడికించిన ప్రాన్స్ (రొయ్యలు), హోమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిసేలా కలియబెట్టాలి.తరువాత దీనిని సర్వింగ్ డిష్‌లో పెట్టి చుట్టూ... టమోటో ముక్కలు, ఉల్లి కాడలు, దోసకాయల ముక్కలు, ఆమ్లెట్ పీసెస్ పెట్టి అలంకరించి వేడివేడిగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే వెరైటీ ఆనియన్ లీవ్స్ రైస్ రెడీ..!