వెనీలా విత్ క్రీమ్ బటర్ "వెనీషియన్స్"
కావలసిన పదార్థాలు :మైదా.. వంద గ్రా.బేకింగ్ పౌడర్.. ఒక టీ.పంచదార.. 50 గ్రా.గుడ్డు.. సగం సొనబటర్.. 50 గ్రా.తయారీ విధానం :మైదా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి. క్రీమ్ బటర్‌లో పంచదార వేసి బాగా కలియబెట్టాలి. బీట్ చేసిన గుడ్డు సొనను బటర్ మిశ్రమంలో కలపాలి. దీంట్లోనే వెనీలా ఎసెన్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఆపై మైదాపిండిని వేసి మడతలు మడతలుగా ఫ్లాట్ గరిటెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక టీస్పూన్ నిండా తీసుకుని ఉండగా చేయాలి.అలా పిండి మొత్తాన్ని ఉండలుగా చేసుకుని నెయ్యి రాసిన ట్రేమీద పెట్టి అదమాలి. వాటికి పోర్క్ తీసుకుని అడ్డం, నిలువు గీతలు వచ్చేలా అదమాలి. అలాగే వాటిపై పంచదారను చల్లాలి. మైక్రోవేవ్ ఓవెన్‌ను 180 డిగ్రీల వరకు వేడి చేయాలి. ఆ తరువాత నెయ్యిరాసిన వెడల్పాటి ప్లేటులో పై ఉండలను పరచి పదిహేను నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే వేడి వేడి వెనీషియన్స్ సిద్ధమైనట్లే..!