రైనీ సీజన్ స్పెషల్.. "స్టఫ్‌డ్ మష్రూమ్స్"
కావలసిన పదార్థాలు : పుట్టగొడుగులు (మష్రూమ్స్).. 200 గ్రా.పనీర్.. 50 గ్రా.జీడిపప్పు.. గుప్పెడుబంగాళాదుంపలు.. రెండుపచ్చిమిర్చి.. నాలుగుఉప్పు.. తగినంతకొత్తిమీర.. ఒక కట్టనిమ్మకాయ.. ఒకటితయారీ విధానం :పుట్టగొడుగుల్ని శుభ్రం చేసి ఉడికించి తీయాలి. గొడుగులకు రంధ్రం పడకుండా కాడను జాగ్రత్తగా తొలగించాలి. బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. అందులోనే పనీర్ తురుము, జీడిపప్పు ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గొడుగుల్లో జాగ్రత్తగా నింపి, వాటిని అలాగే ఓవెన్‌లో ఉంచి ఓ రెండు నిమిషాలు గ్రిల్ చేయాలి. అంతే స్టఫ్‌డ్ మష్రూమ్స్ రెడీ..! ఇవి వానాకాలంలో స్నాక్స్‌లా తినడానికి రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది కూడా..!!