కావలసిన పదార్థాలు :
మామిడిపండు ముక్కలు (ఫిల్లింగ్ కోసం)... రెండు కప్పులు
పాలు... 200 గ్రా.
గుడ్లు... రెండు
మైదా... వంద గ్రా.
కరిగించిన బటర్... వంద గ్రా.
తేనె... రెండు టీ.
తయారీ విధానం :
పాలు, గుడ్లు, మైదా, కరిగించిన బటర్‌లను ఒక పాత్రలోకి తీసుకుని దోసెల పిండిలా అయ్యేదాకా బాగా గిలకొట్టాలి. నాన్‌స్టిక్ పాన్పైన దోసెలాగా వేసి సన్నటి సెగపైన వేగనివ్వాలి. అలా మొత్తం పిండినంతా దోసెల్లాగా వేసి పక్కన పెట్టాలి. ఇలా తయారయిన పాన్ కేక్‌లను చల్లార్చాలి.
ఇప్పుడు చెక్కు తీసిన మామిడి ముక్కలు, తేనెను బాగా కలిపి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఒక్కో పాన్ కేక్‌లో కొద్దిగా పోసి మడతపెట్టి సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో హనీ పాన్ కేక్స్ రెడీ అయినట్లే...!