కావలసిన పదార్థాలు :
బేబీకార్న్.. ఎనిమిది
అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.
బియ్యంపిండి.. రెండు టీ.
మైదా.. రెండు టీ.
మిరియాలపొడి, ఉప్పు.. తగినంత
నూనె.. సరిపడా
తయారీ విధానం :
బేబీకార్న్‌ని కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, బియ్యంపిండి, ఉప్పు, మిరియాలపొడిలను వేసి పకోడీ పిండిలాగా జారుగా కలుపుకోవాలి. ఒక్కో బేబీకార్న్‌ని ఈ పిండిలో బాగా ముంచి.. కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి. అంతే బేబీకార్న్ బుల్లెట్స్ తయార్..! వీటిని వేడివేడిగా చిల్లీ గార్లిక్ సాస్‌తో కలిపి తింటే సూపర్బ్‌గా ఉంటాయి. ఓ పట్టు పట్టేద్దేమా..?!