కావలసిన పదార్థాలు : బాదంపప్పులు... రెండు కప్పులు పాలు... తగినన్ని పంచదార... రెండు కప్పులు నెయ్యి... నాలుగు టీ. గోధుమపిండి... 8 టీ. పిస్తా తరుగు... పది టీ.
తయారీ విధానం : బాదంపప్పులను రెండుగంటలపాటు నానబెట్టాలి. తరువాత బాదం పప్పుల పొట్టుతీసి తగినన్ని పాలుపోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో పంచదార పాకం పట్టి, పాకం మధ్యస్థంగా మారగానే గ్రైండ్ చేసి ఉంచి బాదం గుజ్జును కలిపి సన్నటి మంటమీద కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతుండగా నెయ్యి కలపాలి. బాదం గుజ్జు ఉడుకుతూ దగ్గరవుతుండగా స్టౌ మీది నుంచి దించేయాలి.
ఒక టీస్పూన్ నెయ్యిలో గోధుమపిండిని సువాసన వచ్చేదాకా వేయించాలి. పిస్తాతరుగులో వేయించి గోధుమపిండిని కలిపి పక్కనుంచాలి. బాదం మిశ్రమాన్ని మందంగా రోటీలాగా చేసి రౌండ్ షేప్‌లో కట్ చేయాలి. ఇలా కట్ చేసిన బిళ్లల మధ్యలో పిస్తా మిశ్రమాన్ని పరచి, పైన మరో బిళ్ళనుంచాలి. అలా మొత్తం తయారు చేశాక మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి పదినిమిషాలు ఉడికించి తీసేయాలి. అంతే బేక్‌బాదాం రోస్టెడ్ తయార్..! ఇది నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది.