బెండతో వెరైటీ అండ్ టేస్టీ "ఓక్రా సలాడ్"
కావలసిన పదార్థాలు : లేత బెండకాయలు.. పావు కేజీకోడిగుడ్డు.. ఒకటిసలాడ్ ఆయిల్ లేదా ఆలీవ్ ఆయిల్.. వంద మి.లీ.ఆవపొడి.. చిటికెడుపంచదార.. పావు టీ.మిరియాలపొడి.. పావు టీ.నిమ్మరసం.. ఒక టీ.పాలక్రీం.. పావు కప్పుఉప్పు.. తగినంతతయారీ విధానం :స్టవ్ మీద నీళ్లు పెట్టి ఉప్పువేసి మరిగించాలి. లేత బెండకాయలను ముచ్చిక కోసి మరుగుతున్న నీటిలో వేసి 5 నిమిషాలు ఉడికించి తీసేయాలి. ఆపై నీళ్లు వంపేసి చల్లటి నీటితో రెండుసార్లు కడిగితే బెండకాయలు రంగు మారకుండా ఆకుపచ్చరంగులోనే తాజాగా కనిపిస్తాయి. కాస్త ఉడికీ ఉడకనట్లుగా ఉండే వీటిని కొరికితే కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు బెండకాయలను ఏటవాలు ముక్కలుగా కోసి ప్లేటులో అమర్చాలి. వీటిపై మెయొనెజ్ క్రీమ్‌తో అలంకరించి వడ్డించాలి. అంతే ఓక్రా సలాడ్ సిద్ధమైనట్లే..!మెయొనేజ్ తయారీ ఎలాగంటే..? ఓ చిన్న గిన్నెలో గుడ్డు పగలగొట్టి తెల్లసొనను తీసేసి పచ్చసొన మాత్రమే ఉంచాలి. అందులో పంచదార, ఆవపొడి, ఉప్పు, మిరియాలపొడి, పాలక్రీం వేసి బాగా గిలకొట్టాలి. తరవాత నూనెను కొంచెం కొంచెం పోసి బాగా తిప్పాలి. నూనె అంతా గుడ్డుసొనలో ఇంకిపోయేలా కలిపితే సాస్‌లా తయారవుతుంది. చివరగా ఈ సాస్‌లో నిమ్మరసం కలిపితే అదే మెయొనేజ్ క్రీమ్.. దీనిని ఓక్రాపై అలంకరించి సర్వ్ చేయాలి.