కావలసిన పదార్థాలు :
స్పాంజ్ కేక్... 400 గ్రా.
జామ్... వంద గ్రా.
అరటిపండ్లు... ఎనిమిది
ద్రాక్ష... 200 గ్రా.
యాపిల్స్... రెండు
కమలాపండ్లు... నాలుగు
మీగడ... 200 గ్రా.
పంచదార... 200 గ్రా.
పాలు... 400 గ్రా.
కస్టర్డ్ పౌడర్... 60 గ్రా.
వెనీల ఎసెన్స్... పది చుక్కలు
తయారీ విధానం :
ఓ స్పాంజికేక్‌ని తీసుకుని దానికి ఒకవైపు జామ్ రాసి ఓ పాత్రలో పెట్టాలి. ఇప్పుడు నాలుగు టీస్పూన్ల పంచదారను కప్పు నీటిలో కలిపి కేక్‌మీద చిలకరించాలి. విడిగా ఓ గిన్నెలో అరటిపండ్లు, యాపిల్, ద్రాక్ష, కమలాపండ్లను చిన్న ముక్కలుగా చేసి అందులో మీగడ కలిపి, సగం పంచదారను కూడా వేసి కలియబెట్టాలి. అందులోనే వెనీలా ఎసెన్స్ కూడా వేసి కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని కేక్‌మీద పోసి ఉంచాలి.
ఇప్పుడు మరో గిన్నెలో పాలను వేడిచేస్తూ, అందులో కస్టర్డ్ పౌడర్ కూడా వేసి కలపాలి. ఇది చిక్కగా అయిన తరువాత మిగిలిన పంచదారను వేసి, ఆరాక పండ్ల ముక్కల మిశ్రమం మీదుగా పోసి ఈ మెత్తం కేక్‌ను ఫ్రిజ్‌లో పెట్టి, బాగా చల్లబడ్డాక తీసి ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.