"బటర్ నూడిల్స్" విత్ టొమోటో సూప్
కావలసిన పదార్థాలు :ఉడికించిన పెద్ద టొమోటోలు... మూడువెన్న... ఒక టీస్పూన్నీరు... సరిపడాపచ్చిమిరపకాయ ముక్కలు... కాసిన్నిపంచదార... ఒకటిన్నర టీస్పూన్లుచిదిమిన నూడిల్స్... నాలుగు టీస్పూన్లుఉల్లికాడల ముక్కలు... రెండు టీస్పూన్లుఉప్పు... సరిపడామొక్కజొన్న పిండి... ఒక టీస్పూన్అల్లం పేస్ట్... పావు టీస్పూన్తయారీ విధానం :టొమోటోల పై చర్మం తీసేసి పచ్చిమిరపకాయలను కలిపి మెత్తగా మెదపాలి. మూకుడులో వెన్న వేసి వేడిచేసి అందులో టొమోటో గుజ్జు కలిపి నూనె వేరుపడేంతదాకా ఉడికించాలి. ఆ తరువాత పంచదార, తరిగిన ఉల్లికాడలు, అల్లం పేస్టు, నూడిల్స్, నీరు కలపాలి.నూడిల్స్ మెత్తబడిన తరువాత మొక్కజొన్న పిండి పేస్ట్, ఉప్పు పై మిశ్రమానికి కలపాలి. దీనిని ఆపకుండా కలియబెడుతూ కొద్దిసేపు మంట తగ్గించి ఉంచాలి. ఆ తరువాత మిరియాలతో అలంకరించి కొద్దిగా వెన్నవేసి వేడివేడిగా అతిథులకు అందించాలి.