కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు (మష్రూమ్స్)... రెండు కప్పులు
ఉల్లిపాయముక్కలు.. ఒక కప్పు
పాలు... ఒక కప్పు
జున్ను... నాలుగు టీ.
కార్న్‌ఫ్లోర్... నాలుగు టీ.
కరివేపాకు.. కాస్తంత
ఆలీవ్ ఆయిల్... రెండు టీ.
వెజిటబుల్ స్టాక్... పది కప్పులు
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... ఒక టీ.
డ్రైడ్ మిక్స్‌డ్ హెర్బ్స్... ఒక టీ.
పార్సిలీ హెర్బ్... ఒక టీ.
బ్రెడ్ ముక్కలు... తగినన్ని
తయారీ విధానం :
మష్రూమ్స్, పాలు, జున్నులలో సగంభాగాన్ని తీసుకుని కొద్దిగా కార్న్‌ఫ్లోర్ కలిపి మెత్తని పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. ఆలీవ్ ఆయిల్‌ను గిన్నెలో వేసి కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. మిగిలిన మష్రూమ్స్ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. దీంట్లోనే వెజిటబుల్ స్టాక్, డ్రైడ్ హెర్బ్స్, పార్సిలీ హెర్బ్ కూడా వేసి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మష్రూమ్స్ పేస్ట్‌ను పై మిశ్రమంలో వేయాలి. సూప్ చిక్కబడేంతదాకా కలుపుతూ ఉడికించాలి. చివర్లో ఉప్పు మిరియాలపొడి వేసి దించేయాలి. సర్వ్ చేసే ముందు కరకరలాడేలా వేయించిన బ్రెడ్ ముక్కలను వేసి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి ఫ్రెంచ్ మష్రూమ్ ఆనియన్ సూప్ సిద్ధమైనట్లే...!!