కావలసిన పదార్థాలు :
వెన్న... నాలుగు టీస్పూన్లు
పాలు... ఒక కప్పు
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... అర టీస్పూన్
కోడిగుడ్లు... నాలుగు
బ్రెడ్... నాలుగు ముక్కలు
పంచదార... రెండు టీస్పూన్లు
తయారీ విధానం :
వెన్న వేడి చేసి అందులో మిరియాల పొడి వేసి వేయించి స్టౌవ్ పైనుంచి పాన్‌ను తీసేయాలి. దీంట్లో బ్రెడ్ ముక్కలను వేసి వెన్న పీల్చుకునేదాకా వాటిని అలాగే ఉంచాలి.
మరొక బౌల్ తీసుకుని.. అందులో కోడిగుడ్లు, పాలు, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుకుని.. బ్రెడ్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి ఐదు నిమిషాలపాటు నానబెట్టాలి.
ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్‌ను స్టౌవ్‌పై పెట్టి వేడి చేసి, నానబెట్టి ఉంచుకున్న బ్రెడ్ ముక్కలను వేసి కాల్చాలి. బ్రెడ్ ముక్కలు రెండువైపులా బాగా ఫ్రై అయిన తరువాత చివర్లో పంచదార చల్లి తీసేయాలి. అంతే ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయినట్లే...! దీన్ని అరటిపండు, యాపిల్ లాంటి పండ్లతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.