Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫైనాఫిల్‌ లెమెన్ గ్రిల్‌

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
పైనాపిల్‌ ముక్కలు... ఒక కప్పు
నల్లఉప్పు... ఒక టీ.
నిమ్మకాయ... ఒకటి
ఛాట్‌మసాలా... ఒక టీ.
చెర్రీ పండ్లు... కాసిన్ని
ద్రాక్ష... కొద్దిగా

తయారీ విధానం :
చెక్కుతీసిన పైనాపిల్‌ ముక్కలను ఓ గిన్నెలో వేసి వాటికి... నల్లఉప్పు, నిమ్మరసం, చాట్‌మసాలాలను కలిపి 15 నిమిషాలపాటు నానబెట్టాలి. ఇప్పుడు ఓ సన్నని ఇనుపచువ్వను తీసుకుని ఈ పండ్లముక్కలను ఒకదానివెనక ఒకటి గుచ్చి, మధ్యలో అక్కడక్కడా చెర్రీలు లేదా ద్రాక్ష గుచ్చి గ్యాస్‌ మంటమీదగానీ లేదా నిప్పులమీదగానీ కాల్చి సలాడ్‌లా తినవచ్చు. ఇది ఎపిటైజర్‌గానూ, సలాడ్‌గానూ పనిచేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu