ఫైనాఫిల్, స్ట్రాబెర్రీలతో "ఆల్మండ్స్ జెల్లీ ఫుడ్డింగ్"
కావలసిన పదార్థాలు :ఫైనాపిల్ జెల్లీ... అర ప్యాకెట్స్ట్రాబెర్రీ జెల్లీ... అర ప్యాకెట్పాలు... రెండు కప్పులుసన్నగా తరిగిన చైనా గడ్డి... 2 టీ.పంచదార... 3 టీ.ఆల్‌మండ్స్... కట్ చేసినవి 2 టీ.ఆల్‌మండ్ ఎసెన్స్... కొన్ని చుక్కలుచక్కెర... ఒక కప్పునీళ్ళు... 4 కప్పులుతయారీ విధానం :ముందుగా నీటిలో షుగర్ కరిగించి మిశ్రమం తయారు చేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్యాకెట్ మీదనున్న సమాచారం ప్రకారం రెండు రకాల జెల్లీలను తయారు చేసుకోవాలి. రెండింటినీ విడివిడిగా తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టి ఉంచాలి. చైనా గడ్డిని అరకప్పు నీటిలో కలిపి సన్నటి మంటమీద ఉడికించి, దానికి పాలు, 3 స్పూన్ల చక్కెర కలిపి ఉడికించి చక్కెర కరిగిన తరువాత దించాలి. చల్లారాక ఎసెన్స్, ఆల్‌మండ్ ముక్కలు వేసి కలిపి ఫ్లాట్‌గా ఉండే డిష్‌లో పోసి ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచాలి.ఇవన్నీ గడ్డకట్టిన తరువాత తీసి జెల్లీలను, గ్రాస్‌ను డైమండ్ షేప్‌లో కట్ చేసి సర్వింగ్ డిష్‌లో ముక్కలను ఉంచి వాటిమీద ముందుగా తయారు చేసుకున్న చక్కెర మిశ్రమం పోయాలి. దానిపై డ్రెయిన్డ్ లిచీస్‌ను అమర్చిన తరువాత సర్వ్ చేయాలి. చక్కెరమిశ్రమం బదులు ఐస్‌క్రీమ్ లేదా క్రీముతో సర్వ్ చేసుకోవచ్చు.