ఫాస్ట్ అండ్ టేస్టీ రెసిపీ "ఎగ్ విత్ ఆయిస్టర్ సాస్"
కావలసిన పదార్థాలు :గుడ్లు.. ఆరుఆయిస్టర్ సాస్.. తగినంతఉడికించిన హోమ్.. పావు కప్పుకొత్తిమీర.. కొద్దిగాఉప్పు, మిరియాల పొడి.. రుచికి సరిపడాతయారీ విధానం :ముందుగా ఒక బౌల్‌లో గుడ్లను పగులగొట్టి పోయాలి. ఈ గుడ్ల సొనకి ఉప్పు, మిరియాలపొడి కలిపి ఉంచాలి. ఫ్రైయింగ్ పాన్‌లో 4 టీస్పూన్ల నూనెను వేసి, కాగిన తరువాత గుడ్ల సొన తీసి ఉడికించాలి.ఆపై ఆయిస్టర్ సాస్ కలిపి పైన హోమ్ ముక్కలు, కొత్తిమీర కాడలతో అందంగా అలంకరించి వేడి వేడిగా అతిథులకు వడ్డించాలి. పైన తీసుకున్న కొలతలతో తయారైన ఎగ్స్ విత్ ఆయిస్టర్ సాస్ పదార్థం ముగ్గురు వ్యక్తులకు చక్కగా సరిపోతుంది. మీరూ ట్రై చేసి చూడండి మరి..!