పిల్లలో ఆకలిని పుట్టించే "స్టఫ్డ్ క్యారట్"
కావలసిన పదార్థాలు :క్యారట్లు.. పావు కేజీనూనె.. రెండు టీ.కొత్తిమీర.. కొద్దిగాకొబ్బరికోరు.. రెండు టీ.స్టఫింగ్ కోసం...శనగపిండి.. ఒక టీ.గరంమసాలా... రెండు టీ.సోంపు.. ఒక టీ.అల్లంవెల్లుల్లి.. ఒక టీ.నిమ్మరసం.. ఒక టీ.ఉప్ప, కారం.. సరిపడాపసుపు.. చిటికెడుతయారీ విధానం :స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటిని కలిపి ముద్ద చేయాలి. ఒక్కొక్కొ క్యారట్ దుంపకు నాలుగు గాట్లు పెట్టి.. మసాలా మిశ్రమాన్ని వాటిల్లో కూరాలి. పాన్‌లో నూనె పోసి వేడయ్యాక.. మసాలా నింపిన క్యారెట్లను వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా నీళ్లు చిలకరించి పది నిమిషాలపాటు ఉడికించాలి. చివరగా కొబ్బరికోరును చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.