కావలసిన పదార్థాలు :
పనీర్... అర కేజీ
బ్రెడ్ స్లైసెస్... పది
పచ్చిమిర్చి... ఎనిమిది
బొంబాయి రవ్వ... ఒక కప్పు
పాలు... ఒక కప్పు
వెన్న... నాలుగు టీ.
మైదాపిండి... నాలుగు టీ.
నిమ్మరసం... నాలుగు టీ.
నెయ్యి... నాలుగు టీ.
కొత్తిమీర తురుము... రెండు టీ.
ఉప్పు, నూనె... సరిపడా
తయారీ విధానం :
పనీర్‌ను తురిమి పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి అందులో నెయ్యి వేసి, కరిగాక అందులో బొంబాయి రవ్వ వేయాలి. రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి, పాలు పోయాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక ఉప్పు, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము వేసి వేయించి, రెండు నిమిషాల తరువాత దించేయాలి.
బ్రెడ్ స్లైసెన్‌ను నీటిలో వేసి, తీసి నీటిని పిండేసి, పనీర్ తురుముతోపాటు మెత్తగా కలుపుకోవాలి. దీనిని ఉడికించి పెట్టుకున్న మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్‌లెట్స్‌లాగా చేసి, మైక్రోవేవ్ ఓవెన్లోగానీ, స్టవ్‌పైనగానీ డీప్ ఫ్రై చేసి తీసేయాలి. అంతే పనీర్ కట్‌లెట్స్ రెడీ అయినట్లే..! వీటిని ఏదేనీ గ్రీన్ చట్నీ లేదా చిల్లీసాస్, టొమోటోసాస్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.