టేస్టీ రెసెపీ "టొమోటో క్రొమెస్కీస్"
కావలసిన పదార్థాలు :వెన్న... రెండు టీ.ఉల్లికాడలు.. రెండు కట్టలుమైదా... రెండు టీ.పాలు... అర కప్పుకొత్తిమీర తురుము... రెండు టీ.నిమ్మరసం.. ఒక టీ.ఉప్పు... సరిపడామిరియాలపొడి... తగినంతటొమోటో ముక్కలు.. ఒక కప్పునూనె.. తగినంతతయారీ విధానం :వెన్నను కరిగించి అందులో ఉల్లికాడల తురుము వేసి వేయించాలి. తరువాత మైదాపిండిని కూడా వేసి మరో నిమిషంపాటు కలియబెడుతూ వేయించాలి. ఆపై పాలుపోసి, గరిటెతో తిప్పుతూ మరిగించాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి వేసి కలియబెట్టాలి.రెండు నిమిషాలు అలాగే ఉడికిన తరువాత, టొమోటో ముక్కల్ని కూడా వేసి తిప్పుతూ ఉడికించాలి. తదనంతరం దాన్ని కిందికి దించి చల్లార్చాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి పదిహేను నిమిషాలపాటు బేక్ చేసి తీసి సర్వ్ చేయాలి. అంతో టొమోటో క్రొమెస్కీస్ రెడీ..!!