కావలసిన పదార్థాలు :
రొయ్యలు... అర కేజీ
మంచినూనె... తగినంత
వెల్లుల్లి... 25 రేకలు
కొత్తిమీర.. పావు కప్పు
చింతపండు... 15 గ్రా.
ఉల్లిపాయలు... మూడు
టొమోటోలు... రెండు
ఆవాలు, జీలకర్ర... ఒక టీ.
మసాలాపొడి... రెండు టీ.
తయారీ విధానం :
పాన్‌లో మంచినూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పొట్టుతీసిన వెల్లుల్లి, టొమోటో ముక్కలు, ఆవాలు వేసి వేయించాలి. ఇవి ముదురు గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి. బాగా వేగిన తర్వాత మసాలా పొడిని వేసి బాగా కలియబెట్టాలి. దీంట్లోనే చింతపండు రసం, తగినంత నీరు పోసి మెత్తటి పేస్ట్‌లాగా ఉడికేంతదాకా ఉంచాలి.
తరువాత అందులో శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసి బాగా కలియబెట్టాలి. వాటికి బాగా మసాలా పట్టి, బాగా ఉడికేంతదాకా అలాగే తక్కువ మంటపైన ఉంచాలి. చివరగా సరిపడా ఉప్పువేసి, పైన కొత్తిమీర చల్లి దించేయాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే రోటీల్లోకి సైడ్‌డిష్‌గా వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.