కావలసిన పదార్థాలు :
చైనీస్ రైస్ నూడుల్స్... పావు కేజీ
జీడిపప్పు... వంద గ్రా.
నిమ్మరసం... అర టీ.
ఆవాలు... అర టీ.
మినప్పప్పు... ఒకటిన్నర టీ.
సెనగపప్పు... ఒకటిన్నర టీ.
పసుపు... పావు టీ.
కరివేపాకు... కొద్దిగా
పచ్చిమిర్చి... రెండు
ఉప్పు: తగినంత
కొబ్బరి తురుము... ఒక టీ.
తయారీ విధానం :
నూడుల్స్‌ను మరిగించిన నీళ్లలో వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించి తీసి చిల్లుల మూకుడులో వేసి తడిలేకుండా ఆరబెట్టాలి. స్టవ్మీగ పాన్ పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
తరువాత జీడిపప్పులను కూడా వేసి కాసేపు వేగిన తరువాత ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి తురుము వేయాలి. ఆపై ముందే ఉడికించి ఆరబెట్టుకున్న నూడుల్స్ కలిపి వేడి వేడిగా వడ్డించాలి. అంతే చైనీస్ జీడిపప్పు నూడుల్స్ రెడీ అయినట్లే...!