"చిల్లీ బటర్ ఫ్రైడ్ రైస్" విత్ కాజూ, సాస్..!
కావలసిన పదార్థాలు :పులావ్ రైస్.. 500 గ్రా.ఉల్లిపాయలు.. వంద గ్రా.యాలకులు.. నాలుగుబటర్.. 200 గ్రా.ఉప్పు.. తగినంతచిల్లీ తరుగు.. అరకప్పుతయారీ విధానం :ముందుగా ఉల్లిపాయల్ని తరిగి పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని శుభ్రం చేసుకుని 5 నిమిషాల పాటు ఊరబెట్టాలి. ఓ బాణలిలో బటర్‌ను మరిగించి ఉల్లిపాయ, చిల్లీ ముక్కల్ని అందులో వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత యాలకులు, లవంగాల పొడిని వేసి వేయించాలి.ఇందులో పులావ్ బియ్యాన్ని వేసి కాసేపు వేయించి... వాటికి సమపాళ్ళలో వేడినీటిని పోసి, తగినంత ఉప్పును చేర్చుకోవాలి. బియ్యం ఉడికాక.. పొడిపొడిగా అయిన వెంటనే స్టౌ మీద నుంచి దించేయాలి. ఈ రైస్ మీద వేయించిన జీడిపప్పు, సాస్‌లతో అలంకరించుకుని సర్వ్ చేస్తే సరి..!