"గ్రిల్‌డ్ చికెన్ శాండ్‌విచ్" విత్ లెట్యూస్ పీసెస్...!!
కావలసిన పదార్థాలు :చికెన్ బ్రెస్ట్.. రెండుక్యాబేజీ లేదా లెట్యూస్.. 50 గ్రా.మిరియాలపొడి.. ఒక టీ.ఉప్పు.. తగినంతమయొనైజ్ లేదా వెన్న.. 25 గ్రా.బ్రెడ్.. 8 స్లైసులుతయారీ విధానం :చికెన్ బ్రెస్ట్‌లకు ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం రాసి అరగంటసేపు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని గ్రిల్ చేసి సన్నగా కట్ చేయాలి. క్యాబేజీ లేదా లెట్యూస్ (క్యాబేజీ ఆకులకంటే పలుచగా, పొడవుగా ఉంటుంది)ను సన్నగా తురిమి బ్రెడ్ స్లైసులమీద సర్దాలి. దానిపై చికెన్ ముక్కలు, వెన్న లేదా మయొనైజ్, ఉప్పు, మిరియాలపొడులను వేసి.. సమంగా పరచుకునేటట్లు చేయాలి. దానిపై మరో బ్రెడ్ స్లైసును పెట్టి త్రికోణాకారంలో ఉండేటట్లు కట్ చేసి సర్వ్ చేయాలి.నోట్.. సాధారణంగా శాండ్‌విచ్ తయారీకి బ్రెడ్ స్లైసులను టోస్ట్ చేసి వాటి మధ్య ఎవరికి కావాల్సిన, అసరమైన పదార్థాలను వారు స్టఫ్ చేసి ఒక మూల నుంచి మరొ మూలకు కట్ చేసుకుంటుంటారు. అయితే స్టఫింగ్‌ను బట్టి ఆయా శాండ్‌విచ్‌ల పేరు మారుతుంటుందంతే...!!