గరంగరం స్పెషల్ "పెప్పర్ శాండ్‌విచ్"
కావలసిన పదార్థాలు :వెన్న... ఒక టీ.బ్రెడ్ స్లైసెస్... నాలుగుజున్ను... అర కప్పుఉల్లిపాయ... ఒకటివెల్లుల్లి... ఒక రెబ్బఉప్పు, మిరియాలు... తగినంతకారం పొడి లేదా ఎండుమిర్చి పొడి... కొద్దిగాతయారీ విధానం :జున్ను, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఉప్పు, మిరియాలపొడిలను ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసులమీద పూసి ఒక ట్రేలో ఉంచి మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచి... జున్ను మిశ్రమం బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించి తీసేయాలి. తరువాత వాటిపై కారం పొడి లేదా ఎండుమిర్చి పొడి కొద్దిగా చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే గరంగరంగా ఉండే పెప్పర్ శాండ్‌విచ్ రెడీ...!