కావలసిన పదార్థాలు :
ఖర్జూరాలు (డేట్స్)... పావు కప్పు
పాలు... అర లీ.
బాదంపప్పులు... పది
దాల్చిన చెక్క పౌడి... కాస్తంత
పంచదార... రుచికి సరిపడా
సన్నగా చీల్చి వేయించిన బాదంపప్పు... ఒక టీ.
తయారీ విధానం :
అరకప్పు పాలల్లో ఖర్జూరాలను ఒక గంటసేపు నానబెట్టాలి. తరువాత ఈ మిశ్రమానికి బాదంపప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తబడేదాకా నూరాలి. మిగిలిన పాలను పాన్‌లో పోసి వేడి చేయాలి. అందులో ఖర్జూరం పాలు, బాదంపప్పు మిశ్రమంతోపాటుగా దాల్చిన చెక్క పొడిని కూడా వేయాలి. దీన్ని అలాగే ఐదు నిమిషాలపాటు తక్కువ మంటమీద ఉడికించాలి. దించాక తగినంత పంచదార కలిపి, వేయించిన బాదంపప్పును పైన అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.