Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యారెట్ ఆలీవ్ సలాడ్

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
క్యారెట్ తురుము... రెండు కప్పులు
ఆలీవ్ ఆయిల్... నాలుగు టీ.
పచ్చిశనగలు... 200 గ్రా.
ఉప్పు... అర టీ.
నిమ్మరసం... నాలుగు టీ.
కొత్తిమీర తరుగు... నాలుగు టీ.
జున్ను... 200 గ్రా.
మిరియాలపొడి... అర టీ.

తయారీ విధానం :
క్యారెట్ తురుములో ఉప్పు వేసి కలపాలి. నానబెట్టి పై పొట్టు తీసిన పచ్చి శనగలను నీరు లేకుండా వడగట్టి, క్యారెట్ తురుములో వేసి కలియబెట్టాలి. అందులోనే నిమ్మరసం వేసి, ఆపై ఆలీవ్ ఆయిల్‌ను వేసి మిశ్రమం అంతటికీ పట్టేలా బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర తరుగు, జున్ను వేసి కలిపి మిరియాలపొడి చల్లి సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ ఆలీవ్ సలాడ్ తయారైనట్లే...!

Share this Story:

Follow Webdunia telugu