కిడ్స్ ఈవెనింగ్ స్నాక్స్... "ఇడ్లీక్రష్-క్యారట్ మసాలా
కావలసిన పదార్థాలు :ఇడ్లీలు.. 4క్యారట్ తురుము.. ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము.. అర కప్పు, టొమోటో కెచప్.. రెండు టీ. నూనె.. రెండు టీ.కొత్తిమీర తురుము.. ఒక టీ.పచ్చిమిర్చి.. 3పుదీనా తురుము.. ఒక టీ.నిమ్మరసం.. ఒక టీ.కారం.. పావు టీ.గరంమసాలా పొడి.. చిటికెడు.కరివేపాకు.. రెండు రెమ్మలు ఉప్పు.. తగినంత తయారీ విధానం :ఓ బాణలిలో నూనె పోసి, అది కాగాక కరివేపాకు, పుదీనా, క్యారట్ తురుము వేసి కొద్దిసేపు వేయించాలి. ఆపై చీలికలుగా కోసిన పచ్చిమిర్చి, కారం, ఉప్పు, గరంమసాలాపొడి, కొత్తిమీర తురుము, టొమోటో కెచప్, కొబ్బరి తురుములను అన్నింటినీ ఒకేసారి వేసి కలియబెట్టాలి. వెంటనే చిదిమిన ఇడ్లీలను కూడా వేసి బాగా కలిపి, స్టవ్ మీది నుంచి దించేయాలి. అంతే అద్భుతమైన రుచిగల ఇడ్లీక్రష్-క్యారట్ మసాలా సిద్ధమైనట్లే..!ప్రతి ఇంట్లోనూ ఉదయంవేళ అల్పాహారంగా ఎక్కువగా ఇడ్లీలనే తీసుకుంటుంటారు. తేలిగ్గా చేసుకోగలగడం, ఆరోగ్యానికి మంచిది కావడం... లాంటి ప్రయోజనాలే ఇందుకు ప్రధాన కారణం. అయితే అవే ఇడ్లీలతో రకరకాల వెరైటీలు చేసి సాయంకాలం టిఫిన్‌గా పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇడ్లీలంటేనే మొహం మొత్తేసినవాళ్లు సైతం వీటిని ఇష్టంగా ఆరగిస్తారు కూడా...!