కార్న్‌ఫ్లోర్, ఎగ్‌వైట్‌లతో "చికెన్ విత్ బీన్ స్ప్రౌట్స్"
కావలసిన పదార్థాలు :చికెన్ ముక్కలు... 200 గ్రా.గుడ్డు తెల్లసొన... 1 గుడ్డుదిబ్రాందీ... 1 టీ.కార్న్‌ఫ్లోర్... రెండు టీ.ఉల్లికాడల ముక్కలు... ఒక కట్టవిచక్కెర... అర టీ.ఎండుమిర్చి, పచ్చిమిర్చి... ఒక్కొక్కటిఉప్పు, మిరియాల పొడి... తగినంతతయారీ విధానం :ఒక పాత్రలో చికెన్ ముక్కలను వేసి వాటికి గుడ్డు తెల్లసొన, కార్న్‌ఫ్లోర్, బ్రాందీ, ఉప్పు కలిపి బాగా కలపాలి. పాన్‌లో 5 టీస్పూన్ల నూనె వేసి వేడయిన తరువాత చికెన్ ముక్కలు వేసి 5 నిమిషాలపాటు వేయించాలి. వేగిన ముక్కలను తీసి ప్లేటులో పెట్టుకుని, పైన చెప్పిన వాటిలో మిగిలిన పదార్థాలను అదే పాన్‌లో రెండు నిమిషాలపాటు వేయించాలి. తరువాత దీనికి చికెన్ ముక్కలను కలిపి కాసేపు వేగిన తరువాత వేడివేడిగా సర్వ్ చేయాలి.