కావలసిన పదార్థాలు : జీడిపప్పులు... ఒక కప్పు పంచదార... ఒక టీ. నెయ్యి... పావు కప్పు చాక్లెట్ రైస్... తగినన్ని (మార్కెట్లో దొరుకుతాయి)
తయారీ విధానం : జీడిపప్పును రెండు గంటలపాటు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉండే పాత్రలో పంచదార పాకంపట్టి జీడిపప్పు మిశ్రమాన్ని కలిపి, దగ్గరికి వచ్చేంతదాకా కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడగానే నెయ్యి కలిపి సన్నటి మంటమీద కలుపుతూ ఉడికించాలి.
నెయ్యి మొత్తం జీడిపప్పు మిశ్రమంలో బాగా కలిశాక స్టౌమీది నుంచి దించేయాలి. మిశ్రమం చల్లారిన తరువాత చిన్న ముద్ద తీసుకుని రోల్ చేసి కావాల్సిన సైజులలో కట్ చేసి, చాక్లెట్ రైస్‌ను అద్దినట్లయితే... కాజూ చాక్లెట్ రోల్స్ రెడీ అయినట్లే...!!