"ఎగ్ నూడుల్స్" వెరీ వెరీ గుడ్డు...!!
కావలసిన పదార్థాలు :గుడ్లు.. నాలుగుఉడికించిన నూడుల్స్... ఒక కప్పుగరంమసాలా.. ఒక టీ.పచ్చికొబ్బరికోరు.. పావు కప్పుపచ్చిబఠాణీలు.. కొద్దిగాఉడికించిన బంగాళాదుంప.. ఒకటిపుదీనా.. కొద్దిగాకారం, ఉప్పు.. తగినంతనూనె.. సరిపడాతయారీ విధానం :ముందుగా ఉడికించిన గుడ్లను అడ్డంగా కోసి, దానిలోని పచ్చసొనని తీసివేయాలి. ఉడికించిన పచ్చిబఠాణీలను, బంగాళాదుంపను కలిపి కాస్తంత ఉప్పు, గరంమసాలా వేసి కలియబెట్టాలి. కాస్తంత నూనెలో పుదీనాను వేయించి ఆ తరువాత బఠాణీ మిశ్రమావన్ని వేసి కాసేపు వేయించి తీసేయాలి. ఇప్పుడు ఆ మసాలాని గుడ్ల మధ్యన కొద్దిగా ఉంచి ఇంకో ముక్కతో మూసేయాలి.ఆ గుడ్లు విడిపోకుండా వాటికి టూత్‌పిక్ అమర్చాలి. నూడుల్స్‌ను ఉప్పువేసి ఉడికించి పక్కన ఆరబెట్టాలి. నాన్‌స్టిక్ పెనంపై కాస్తంత నూనె వేసి గుడ్డును కాసేపు వేయించి తీయాలి. తరువాత నూడుల్స్‌ను కూడా వేసి, రెండు నిమిషాలపాటు అటూ, ఇటూ తిప్పి ఒక ప్లేటులో అమర్చి వాటిపై కొబ్బరికోరు, గరంమసాలా వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.