కావలసిన పదార్థాలు :
మైదా... పావు కేజీ
కోడిగుడ్లు... రెండు
నూనె... మూడు టీ.
ఉప్పు... తగినంత
వెలుల్లి... రెండు
మెయొనెజ్... ఒక కప్పు
క్రీము... ఒక కప్పు
నూనె... ఒక టీ
తయారీ విధానం :
మైదాపిండిని జల్లించి ఉప్పు కలిపి అందులో ముప్పావుకప్పు నీళ్లు, గుడ్డు పచ్చసొన కలిపి గట్టిముద్దలా చేసి 10 నిమిషాలు నానబెట్టాలి. తరువాత దీన్ని అప్పడాలకర్రతో చపాతీలా వత్తి సన్నని రిబ్బన్లలా చాకుతో కత్తిరించాలి. లేదా రిబ్బన్ పాస్టాలు మార్కెట్లో రెడీమేడ్‌గా కూడా దొరుకుతుంటాయి. వీటిని మరిగించిన నీళ్లలో వేసి 5 నిమిషాలు ఉడికించి నీళ్లన్నీ వంపేసి ఆరబెట్టాలి.
వెడల్పాటి బాణలి లేదా నాన్‌స్టిక్ పాన్‌లో ఒక టీస్పూను నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. ఆపై రిబ్బన్ పాస్టాను వేసి రెండు నిమిషాలు వేయించి ప్లేటులో పోయాలి. ఇప్పుడు విడిగా ఓ చిన్న గిన్నెలో మెయొనెజ్, క్రీము, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, పాస్టాలమీద పోసి వేడివేడిగా అందిస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి.