ఆలీవ్ సువాసనలతో "ఆలీవ్ విత్ చికెన్"
కావలసిన పదార్థాలు :ఆలీవ్ నూనె.. వంద గ్రా.చికెన్ ముక్కలు.. ఒకటిన్నర కిలోఅల్లంముద్ద.. ఒక టీ.జీలకర్ర.. అర టీ.నిమ్మకాయ ముక్కలు... రెండువెల్లుల్లిపాయ.. ఒకటికారం.. ఒక టీ.మైదాపిండి.. ఒక టీ.మంచినీరు.. ఒక గ్లాసుఉడికించిన ఆకుపచ్చని ఆలీవ్ గింజలు.. 300 గ్రా. నిమ్మరసం.. ఒక టీ.కొత్తిమీర.. ఒక కట్టఉప్పు.. తగినంతతయారీ విధానం :ఒక గిన్నెలో నూనె పోసి చికెన్ ముక్కలు వేసి వేయించాలి. కాస్తంత వేగాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముద్ద, జీలకర్ర, కారం వేసి బాగా కలియబెట్టాలి. అందులో ఒక కప్పు మంచినీళ్లు పోసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత మైదా పిండిని ఒక కప్పు నీటిలో కలిపి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి 45 నిమిషాలపాటు ఉడికించాలి.తరువాత ఉడికించి పెట్టుకున్న ఆలీవ్ గింజల్ని కూడా వేసి మరో పదినిమిషాలపాటు సన్నని మంటపై ఉడికించాలి. చివర్లో నిమ్మరసం, కొత్తిమీర వేసి దించేయాలి. అంతే ఆలీవ్ ఘుమఘుమలతో తయారైన టేస్టీ రెసిపీ ఆలీవ్ విత్ చికెన్ రెడీ...!