Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాట్‌ వెజిటబుల్స్‌ విత్ గార్లిక్

Advertiesment
వంటకాలు చైనీస్ హాట్ వెజిటబుల్స్ విత్ గార్లిక్ క్యారెట్ క్యాప్సికం బీన్స్ క్యాబేజీ టొమోటో గుజ్జు వెల్లుల్లి పండుమిర్చి వెనిగర్
కావలసిన పదార్థాలు :
క్యారెట్లు... 200 గ్రా.
క్యాప్సికం... 200 గ్రా.
బీన్స్... వంద గ్రా.
క్యాబేజీ... 200 గ్రా.
టొమోటో గుజ్జు... రెండు కప్పులు
వెల్లుల్లి... వంద గ్రా.
పండుమిర్చి పేస్ట్... నాలుగు టీ.
వెనిగర్... ఆరు టీ.
అల్లం... కొద్దిగా
అజినమోటో... అర టీ.
కార్న్‌ఫ్లోర్... నాలుగు టీ.
ఉల్లిపాయలు... నాలుగు
ఉప్పు... తగినంత
నూనె... ఐదు గరిటెలు

తయారీ విధానం :
క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికమ్‌, క్యాబేజీలను చిన్న చిన్న ముక్కలుగా కోసి నూనెలో వేసి వేయించాలి. ఓ పాన్‌లో కొంచెం నూనె పోసి అల్లం ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరవాత వెనిగర్‌లో కలిపిన మిర్చిపేస్ట్‌ను వేసి వేయించాలి. అందులోనే ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి మరిగించి, తరువాత టొమాటో గుజ్జు, తగినంత ఉప్పు వేసి కలపాలి.

కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లలో కలిపి చిక్కని సాస్‌లా చేయాలి. దీన్ని కూడా కూరలో కలపాలి. అజనొమాటోను వేశాక, కూరగాయల ముక్కలన్నీ వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించాలి. అంతే హాట్‌ వెజిటబుల్స్‌ విత్ గార్లిక్ సిద్ధమైనట్లే..! దీన్ని నూడుల్స్‌తోగానీ ఫ్రైడ్‌‌రైస్‌తోగానీ తింటే బాగుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu