"సూకీ జింగా"కు వంకలు పెట్టగలమా..?
కావలసిన పదార్థాలు :పచ్చిరొయ్యలు... అర కేజీపచ్చిమిర్చి... ఐదుఉప్పు, నూనె... తగినంతకొబ్బరి... రెండు ముక్కలుకొత్తిమీర.. ఒక కట్టపసుపు.. పావు టీ.ఉల్లిపాయలు... 150 గ్రా.అల్లంవెల్లుల్లి... ఒకటిన్నర టీ.టొమోటోలు.. మూడుకరివేపాకు... ఒక కట్టజీలకర్ర... అర టీ.కారం... ఒక టీ.తయారీ విధానం :రొయ్యల్ని శుభ్రం చేసి.. ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన ఉంచాలి. కొబ్బరి ముక్కలను తీసుకుని ముద్దగా నూరాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్రలను కూడా మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఉల్లిముద్దను వేసి ఫ్రై చేయాలి. కారంపొడి, కరివేపాకు కూడా అందులో వేసి బాగా కలియబెట్టాలి.కాసేపు అలాగే వేగాక టొమోటో ముక్కలు, కొబ్బరి ముద్దను వేసి ఎర్రగా వేయించాలి. చివర్లో ఉప్పు పట్టించిన రొయ్యల్ని అందులో వేసి బాగా కలియబెట్టాలి. రొయ్యల్లోని నీరు ఆవిరయ్యేంతదాకా అలాగే ఉంచి కలుపుతూ ఉడికించాలి. చివర్లో ఉప్పు సరిజూసి, పైన కొత్తిమీర తరుగును చల్లి దించేయాలి. అంతే సూకీ జింగా తయార్...!!