Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షుగర్ ఫ్రీ కాజూ బర్ఫీ

Advertiesment
షుగర్ ఫ్రీ కాజూ బర్ఫీ
FILE
కావలసిన పదార్థాలు :
జీడిపప్పులు... ఒక కప్పు
షుగర్ ఫ్రీ పౌడర్... ఒక కప్పు
నెయ్యి... పావు కప్పు

తయారీ విధానం :
జీడిపప్పులను ఒక గంటపాటు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో షుగర్ ఫ్రీ పౌడర్‌ను వేసి మధ్యస్థంగా పాకం పట్టుకోవాలి. గ్రైండ్ చేసి ఉంచిన జీడిపప్పు మిశ్రమాన్ని పాకంలో కలిపి దగ్గరయ్యేంతదాకా కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమానికి నెయ్యి కూడా కలిపి సన్నటి మంటమీద మిశ్రమం దగ్గరపడేవరకు ఉంచి, స్టౌమీది నుంచి దించేయాలి.

తరువాత ఈ మిశ్రమాన్ని ప్లేటులో సమానంగా పరచి, చల్లారిన తరువాత ముక్కలు చేసుకోవాలి. అంతే షూగర్ ఫ్రీ కాజూ బర్ఫీ సిద్ధమైనట్లే..! చివర్లో జీడిపప్పు, పిస్తా ముక్కలను కాజూ బర్ఫీ ముక్కలపైన అమర్చి గార్నిషింగ్ చేసి సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu