వెరైటీ అండ్ టేస్టీ... "డేట్స్ కేక్ విత్ హనీ"
కావలసిన పదార్థాలు :మైదా.. 200 గ్రా.పంచదార పొడి.. 125 గ్రా.మార్గరిన్ లేదా వెన్న.. 125 గ్రా.ఖర్జూరం ముక్కలు.. 100 గ్రా.మిల్క్‌మెయిడ్.. 25 గ్రా.గుడ్లు.. రెండుఎండుద్రాక్ష.. 25 గ్రా.తేనె.. రెండు టీ.వెనిల్లా ఎసెన్స్.. అర టీ.బేకింగ్ పౌడర్.. పావు టీ.గ్లిజరిన్.. పావు టీ.మంచినీరు.. ఒక టీ కప్పు తయారీ విధానం :మైదా, పాలపొడి, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. అందులో తురిమిన మార్గరిన్ లేదా వెన్న వేసి పొడిపొడిగా కలిపి.. తేనె పోసి కలపాలి. కోడిగుడ్డు సొనలో వెనిల్లా ఎసెన్స్, గ్లిజరిన్, నీళ్లు, చక్కెరపొడి కలిపి గిలకొట్టాలి. తరువాత ఇందులో మైదా మిశ్రమం వేసి బాగా కలిపి ఖర్జూరముక్కలు, ఎండు ద్రాక్ష కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పాత్రలో పోయాలి.పైన కాస్త తేనె పోసి, పంచదార పొడి చల్లి, ఆపైన ఖర్జూరం, ఎండు ద్రాక్ష ముక్కలు పేర్చి మైక్రోవేవ్ ఓవెన్‌లో 365 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద 25 నిమిషాలపాటు బేక్ చేయాలి. ఓవేన్ లేని వారయితే కుక్కర్‌లో నీళ్లు పోయకుండా అడుగున ఓ గిన్నె బోర్లించి దానిమీద కేకు మిశ్రమం ఉన్న గిన్నె పెట్టి సుమారు అరగంటసేపు సిమ్‌లో ఉడికించాలి. అంతే ఖర్జూరం కేక్ తయార్..!!