వానల్లో వేడి వేడిగా.. "బేబీకార్న్ కబాబ్"
కావలసిన పదార్థాలు :లేత మొక్కజొన్న గింజలు.. 2 కప్పులుపచ్చిమి్చి.. 6ఉల్లిపాయ.. ఒకటిఅల్లం.. చిన్న ముక్కవడగట్టిన పెరుగు.. అర కప్పుగరంమసాలా.. పావు టీ.ఛాట్ మసాలా.. పావు టీ.కొత్తిమీర.. 2 కట్టలుక్యాప్సికమ్.. ఒకటినిమ్మరసం.. 4 టీ.ఉప్పు.. తగినంతతయారీ విధానం :లేత మొక్కజొన్న గింజల్ని ఒలిచి మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాప్సికమ్, అల్లం... అన్నీ చాలా సన్నగా తరగాలి. ఓ పాత్రలో రుబ్బిన మొక్కజొన్న ముద్ద వేయాలి. అందులోనే ఉప్పు, గరంమసాలా, ఛాట్‌మసాలా, అల్లంముక్కలు వేసి కలపాలి.తరువాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, వడకట్టిన పెరుగు వేసి కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేలు మందంలో ఉండే ఇనుపచువ్వను తీసుకుని ఈ కబాబ్ మిశ్రమాన్ని దాని చుట్టూతా అంటించి నిప్పులు లేదా గ్యాస్‌స్టవ్‌మీద ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే బేబీకార్న్ కబాబ్ తయారైనట్లే..! వీటిని వేడివేడిగా చట్నీతో వడ్డిస్తే అద్భుతంగా ఉంటాయి.