మాచోస్ విత్ సల్సా అండ్ సోర్ క్రీం
కావలసిన పదార్థాలు :మాచోస్.. 3 ముక్కలుసల్సా తయారీకి కావాల్సినవి :టొమోటో తరుగు... ఒక కప్పుఉల్లితరుగు... రెండు టీ.పచ్చిమిర్చి తరుగు... అర టీ.కొత్తిమీర తరుగు... ఒక టీ.నిమ్మరసం... ఒక టీ.ఉప్పు... తగినంతమిరియాలపొడి... తగినంతఆలీవ్ ఆయిల్.. ఒక టీ.తయారీ విధానం :సల్సా తయారీ కోసం పైన చెప్పుకున్న అన్నింటినీ కచ్చాపచ్చాగా దంచి ఉంచాలి. వంద మిల్లీగ్రాముల క్రీంకు, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి సోర్ క్రీం తయారు చేసుకోవాలి. సల్సాను, సోర్ క్రీంను పక్కపక్కన ఉంచుకోవాలి. మాచోస్ (పొడుగు బ్రెడ్ ముక్కలు మార్కెట్లో దొరుకుతాయి)ని సర్వింగ్ ప్లేట్‌లో అమర్చి.. సల్సా, సోర్ క్రీంలను పైన అమర్చి సర్వ్ చేయాలి. అంతే మాచోస్ విత్ సల్సా అండ్ సోర్ క్రీం తయారైనట్లే..!