కావలసిన పదార్థాలు :
మటన్... పావు కేజీ
నూనె... 50 గ్రా.
కొబ్బరిపాలు... ఒక కప్పు
గిలకొట్టిన పెరుగు... అర కప్పు
ఉల్లిముద్ద... ఒక టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద... ఒక టీ.
కొత్తిమీర తురుము... ఒక టీ.
కారం... అర టీ.
ధనియాలపొడి... అర టీ.
గరంమసాలా... అర టీ.
పసుపు... కొద్దిగా
పచ్చిమిర్చి ముద్ద... అర టీ.
గసాల ముద్ద... అర టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
మటన్‌ముక్కల్ని శుభ్రం చేసి పసుపు, కారం, పచ్చిమిర్చి ముద్ద, అల్లంవెల్లుల్లి ముద్ద, గసాలముద్ద, మసాలా పొడి, తగినంత ఉప్పు, ఉల్లిముద్ద, కొబ్బరిపాలు, పెరుగు అన్నీ పట్టించి కొద్దిసేపు అలా ఉంచాలి. తరవాత ముక్కలున్న గిన్నెను కుక్కర్‌లో ఉంచి 20 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి తీయాలి.
మందపాటి కడాయిలో నూనె పోసి, కాగాక మటన్‌ముక్కలు వేసి మీడియం సెగమీద ఉడికించాలి. తరవాత ధనియాల పొడి, కొత్తిమీర చల్లి కళాయి దించాలి. చల్లారిన తరవాత ఈ ముక్కల్ని సీసాలో భద్రపరిస్తే వారం రోజులదాకా నిల్వ ఉంటాయి. మాంసాహార ప్రియులు వీటిని స్నాక్స్‌లాగా కూడా తీసుకోవచ్చు.