కావలసిన పదార్థాలు :
మైదాపిండి... పావు కిలో
వెన్న... 100గ్రా.
ఉప్పు... టీస్పూను
కోడిగుడ్లు... 3
పాలు... కప్పు
ఉల్లిపాయలు... 100గ్రా.
ఛీజ్... 50గ్రా.
కొత్తిమీర... 2 కట్టలు
మిరియాలపొడి... అరటీస్పూను
తయారీ విధానం :
మైదాపిండిని జల్లించి ఉప్పు వేసి కలిపి, వెన్న కూడా వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు చల్లి మెత్తని ముద్దలా కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి. అప్పడాలకర్రతో పెద్దసైజు చపాతీలా కాస్త మందంగా వత్తాలి. తరువాత దీన్ని గుండ్రంగా ఉన్న చిన్న ప్లేటుతో పది ముక్కలుగా కత్తిరించాలి.
ఇప్పుడు ఒక్కో ముక్కనూ కటోరీ లేదా కప్‌కేక్ మౌల్డ్‌లో పెట్టి ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద 10 నిమిషాలు బేక్ చేసి తీయాలి. ఓ పాత్రలో గుడ్డు, పాలు, తరిగిన ఉల్లిపాయ, తురిమిన చిజ్, కొత్తిమీర, మిరియాలపొడి, ఉప్పు కలిపి బాగా తిప్పాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా ఒక్కో కప్పులో వేసి మళ్లీ ఐదు నిమిషాలు బేక్ చేస్తే మంచి రుచి గల ఖీశ్ లోరైన్ రెడీ.