Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రోటీన్ల లోపాన్ని సరిచేసే "డచెస్ ఆఫ్ విండ్‌స్టర్"

Advertiesment
ప్రోటీన్ల లోపాన్ని సరిచేసే
కావలసిన పదార్థాలు :
ఆపిల్.. సగం
ఖర్జూరం.. 50 గ్రా.
పాలు.. 300 ఎం.ఎల్.
చక్కెర... 3 టీ.
తేనె... 2 టీ.

తయారీ విధానం
200 ఎం.ఎల్.ల పాలను ఫ్రీజర్‌లో గట్టిగా అయ్యేంతదాకా ఉంచాలి. ఖర్జూరంలోని గింజల్ని తీసివేసి కాసేపు వాటిని నానబెట్టాలి. ఆపిల్ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఖర్జూరాన్ని నీటిలో నుంచి బయటికి తీయాలి. ఆపిల్ ముక్కలు, ఖర్జూరం, ఐస్ అయిన పాలు, మిగిలిన పాలు, చక్కెరలను మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. కావాలనుకునేవారు చక్కెరకు బదులుగా తేనె వాడవచ్చు.

అంతే డచెస్ ఆఫ్ విండ్‌స్టర్ తయార్..! ఈ జ్యూస్‌ను గ్లాసుల్లో పోసి అవసరమైతే ఐస్ ముక్కలు కలిపి చల్ల చల్లగా సర్వ్ చేయాలి. ఈ జ్యూస్‌లోని పిండి పదార్థాలు ఎనర్జీ లెవల్స్‌ను సాధారణ స్థితిలో ఉంచేందుకు సాయపడతాయి. తరచుగా పిల్లల్లో ప్రోటీన్ లోపంవల్ల వచ్చే క్వాషియోకర్‌ను రాకుండా ఇది నిరోధిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu