Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొటాటో స్పెషల్ "బర్డ్స్ నెస్ట్‌"

Advertiesment
పొటాటో స్పెషల్
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు.. పావు కేజీ
ఉప్పు.. తగినంత
మిరియాలపొడి.. పావు టీ.
నిమ్మకాయ.. ఒకటి
సేమ్యా.. వంద గ్రా.
గుడ్డు... ఒకటి
నూనె.. తగినంత

తయారీ విధానం :
బంగాళాదుంపల్ని తొక్క తీసి ఉడికించాలి. దుంపలు కాస్త చల్లారాక వాటిని గరిటెతో మెత్తగా మెదపాలి. అందులోనే మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డు ఆకారంలో ఉండలుగా చేయాలి. ఓ చిన్నగిన్నెలో గుడ్డుసొన వేసి బాగా గిలకొట్టాలి.

ఉండలుగా చేసిన దుంప ముద్దల్ని గుడ్డుసొనలో ముంచి తరువాత సేమ్యాలో దొర్లించి తీయాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఓ బాణలిలో నూనె పోసి బాగా కాగుతుండగా పై ఉండల్ని వేసి బాగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడిగా, కమ్మటి రుచిగల "బర్డ్స్ నెస్ట్‌" సిద్ధమైనట్లే..!

Share this Story:

Follow Webdunia telugu